ఏడేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి.. ఆ తర్వాత చంపి.. ఆ తర్వాత నీళ్ల డ్రమ్ములో పూడ్చిపెట్టిన ఘటనలో నిందితుడు చనిపోయాడు. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఆ ఘటనపై మదనపల్లి అట్టుడికిపోయింది. నిందితుడిని మాకు అప్పగించాలంటూ జనం తిరగబడ్డారు. ఈ క్రమంలోనే నిందితుడు కులవర్దన్ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతన్ని విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు తీసుకెళుతున్న సమయంలో.. కులవర్దన్ పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. పోలీసుల నుంచి తప్పించుకున్న నిందితుడు కులవర్దన్ కోసం గాలిస్తుండగా.. మదనపల్లి సిటీ శివార్లలోని ఓ చెరువులో అతని శవం దొరికింది.
కులవర్దన్ మృత దేహాన్ని మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుని బంధువులు వచ్చిన తరువాత పోస్టమార్టం చేస్తామని పోలీసులు తెలిపారు. మంగళవారం కులవర్దన్ ని అతని ఇంటి వద్ద అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకొని వెళుతుండగా పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయాడు.
పోలీసుల నుంచి తప్పించుకున్న కులవర్దన్ నిందితుడి కోసం పోలీసులు విస్తృతంగా మూడు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో బుధవారం( ఫిబ్రవరి 18) ఉదయం కురబలకోట మండలం కనసానిపల్లె చెరువులో కులవర్ధన్ తేలాడు తున్నట్లు మృతదేహం లభించిందని పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
